Site icon HashtagU Telugu

TS : విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్…!!

Government Of Telangana Logo

Government Of Telangana Logo

తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీ ( మ్యూచువల్ ట్రాన్స్ ఫర్)లకు రాష్ట్ర సర్కార్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కింద ఉపాధ్యాయులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే …విద్యాశాఖలో ఉపాధ్యాయులు పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 2558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Exit mobile version