Site icon HashtagU Telugu

TG DSC Result 2024: డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రికాసేప‌ట్లో రిజ‌ల్ట్స్‌..!

TS DSC Result 2024

TS DSC Result 2024

TG DSC Result 2024: తెలంగాణ డీఎస్సీ (TG DSC Result 2024) అభ్య‌ర్థుల‌కు సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ ఎగ్జామ్ రాసి ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న అభ్య‌ర్థ‌ల నిరీక్ష‌ణ‌కు మ‌రికాసేప‌ట్లో తెర‌ప‌డ‌నుంది. సీఎం రేవంత్ రెడ్డి స‌చివాలయంలో ఉద‌యం 11 గంట‌ల‌కు డీఎస్సీ ఫ‌లితాల‌ను విడుదల చేయ‌నున్న‌ట్లు అధికారులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

సోమ‌వారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి.. ఇత‌ర అధికారుల‌తో క‌లిసి విడుద‌ల చేయ‌నున్నారు. గత ఏడాది డిసెంబర్​లో అధికారం చేపట్టిన కాంగ్రెస్​ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీన 11062 టీచర్​ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ సారి DSC పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి స‌రికొత్త రికార్డును సీఎం రేవంత్ ప్ర‌భుత్వం నెల‌కొల్ప‌నుంది.

Also Read: Yoga Poses : రోజంతా శరీరంలో శక్తిని కాపాడుకోవడానికి ఉదయాన్నే ఈ యోగా ఆసనాలను చేయండి.!

అయితే ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫైన‌ల్ కీ అభ్యంతరాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండానే ఫ‌లితాలు విడుద‌ల చేయ‌టం ఏంట‌ని కొంత‌మంది అభ్య‌ర్థులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాకుండా జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్స్ సైతం విడుద‌ల కాలేద‌ని ఆరోపించారు. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/లో చెక్‌ చేసుకోవచ్చు.

స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, హైస్కూల్ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను TS DSC అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు అభ్యర్థించారు. TS DSC ఫ‌లితాల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఈ క్రింది ద‌శ‌లు అనుస‌రించండి.