Site icon HashtagU Telugu

CM KCR : ఇవాళ్టి నుంచి డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్..!!

CM kcr and telangana

CM KCR Telangana

ఇవాళ్టి నుంచే డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్ అందిచనున్నట్లు ప్రటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ . భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దేశంలో నిరుద్యోగం తీవ్రం అవుతుందన్నారు. కేంద్రంలోని కొంతమంది నీచరాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఇవాళ ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారన్నారు. దేశ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం ఎక్కువని సీఎం వివరించారు. రాష్ట్ర సర్కార్ దళితబంధు అనే పథకాన్ని గొప్పగా అమలు చేస్తుందన్న వివరించారు. తెలంగాణ ఆర్థిక రంగలో దూసుకుపోవడంతోపాటుగా అన్నపూర్ణగా మారిందని గుర్తు చేశారు. రాష్ట్రం అపూర్వ విజయాలను సాధిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హరితహారం కార్యక్రమంతో తెలంగాణ ఆకుపచ్చగా మారిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.