Site icon HashtagU Telugu

TS Cabinet: తెలంగాణ కేబినెట్ మీట్.. కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు

తెలంగాణాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతన్నాయి. కేసుల కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకున్న కేసులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. కేసుల తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. సంక్రాంతి సెలవులను ఈ నెల 8 నుండి 16వ తేదీ వరకు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా కరోనా నేపథ్యంలో సెలవులను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో కరోనా కేసుల కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పెట్టడంతో సహా పలు ఆంక్షలను విధించే అవకాశమున్నట్లు సమాచారం. కరోనా, లక్డౌన్ వల్ల గత సంవత్సరం కాలంగా ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అటు ప్రజల జీవన స్థితిగతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఆసక్తిగా మారింది.