TS Cabinet : 58ఏళ్లు నిండిన వారికి ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లు…ఆమోద ముద్ర వేసిన కేబినెట్..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సమావేశం అయిన రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా సాగింది. ఐదు గంటలపాటు సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Kcr Telangana Job Notification

Kcr Telangana Job Notification

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సమావేశం అయిన రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా సాగింది. ఐదు గంటలపాటు సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 58ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలని ఈమధ్యే కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి గురువారం కేబినెట్ భేటీ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా ఈనెల 15న రాష్ట్రవాప్తంగా అర్హులైన 10 లక్షల మందికి కొత్తగా ఫించన్లు అందనున్నాయి.

స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయనున్నట్లు కేసీఆర్ ఈ మధ్యే ప్రకటించారు. ఈ నిర్ణయంపైనా కూడా కేబినెట్ ఈ ఆగస్టు 15 నాడు రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఉన్న ఖైదీల్లో 75మంది ఖైదీలను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. కోఠీలోని entఆసుపత్రి అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దుతూ ఇఎన్టీ టవర్స్ ను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. సరోజినిదేవి కంటి ఆసుపత్రిని కూడా ఆధునీకరిస్తూ కొత్త భవన సముదాయాన్ని నిర్మించేందుకు కేబినెట్ తీర్మానించింది.

  Last Updated: 11 Aug 2022, 08:48 PM IST