Site icon HashtagU Telugu

Water Dispute: ఏపీపై తెలంగాణ ఫిర్యాదు

Krishna Water

Krishna Water

అక్ర‌మంగా కృష్ణా నీటిని తోడేందుకు ఏపీ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రోసారి ఫిర్యాదు చేసింది. కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతం పిన్నాపురం పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ద్వారా జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు గోరుకల్లు రిజర్వాయర్‌ను నింపే శ్రీశైలం కుడి బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకునేందుకు ఏపీ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నదీ పరీవాహక ప్రాంతం వెలుపల ఉన్న ప్రాంతానికి అక్రమంగా నీటిని డ్రా చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరిన్ని ప్రణాళికలు రచిస్తోందని తెలంగాణ ఆరోపించింది.

కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద పంప్‌డ్‌ స్టోరేజీ స్కీమ్‌ నిర్మాణానికి ఏపీ ముందుకెళ్తోందని, ఇందుకోసం నీళ్లివ్వాలని ఇరిగేషన్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు వారం రోజుల్లో రెండుసార్లు లేఖ రాశారు.
శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రణాళికలు అక్రమమని తెలంగాణ చాలా కాలంగా చెబుతోంది.

మే 28న పంపిన లేఖలో, మే 21న లేఖ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు వెళ్లకుండా ఏపీని నిరోధించాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరిందని పేర్కొంది. “కానీ, KRMB ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి చర్యను ప్రారంభించలేదు.” ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పంప్‌డ్ స్టోరేజీ పథకాల వివరాలను పొంది వాటిని తెలంగాణకు అందించాలని KRMBని తెలంగాణ కోర‌డంతో మ‌ళ్లీ కృష్ణా జ‌లాల వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది.