Site icon HashtagU Telugu

TRT Exam : తెలంగాణ లో మరో పరీక్ష కూడా వాయిదా పడబోతుందా..?

Trt Exam

Trt Exam

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Telangana Assembly Election Schedule 2023) నిరుద్యోగ యువత తో పాటు పోటీ పరీక్షలకు సిద్దమైన యువత ఫై పిడుగు పడేలా చేసింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన గ్రూప్ పరీక్షలు (Group Exams)..మరోసారి ఈ ఎన్నికల వల్ల వాయిదా పడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్‌-2 ( Group 2) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. నవంబర్‌ 2, 3 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. పోలింగ్‌కు, ఇటు పరీక్షలకు పెద్ద ఎత్తున పోలీసులతో పాటు ఇతర శాఖల సిబ్బంది కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడం తో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వాయిదా వేసిన పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించబోతున్నారు. ఇక ఈ పరీక్షలే కాకుండా తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష(TRT) సైతం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రవ్యాప్తంగా 5వేలపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టీఆర్టీ (TRT) పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ విధానంలో ఆరు రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వడంపై పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్లు, 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 24న భాషా పండితులు, 25 నుంచి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు సంబంధించి టీఆర్టీ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనున్నాయి. ఈ క్రమంలో TRT పరీక్షను వాయిదా వేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఉండడం తో అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. అటు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల భద్రత కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారట. ఈ విషయమై విద్యాశాఖకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.

Read Also : Mysterious Climate in Kodurupaka : ఆ గ్రామంలో 4 గంటలకే చీకటి..కారణం ఏంటి..?