TRS Vs BJP: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. అభివృద్ధిపై ‘ఓపెన్ డిబేట్’ కు సవాల్!

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన వ్యాఖ్యలను ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిపై

Published By: HashtagU Telugu Desk
Bjp And Trs

Bjp And Trs

బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన వ్యాఖ్యలను ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీకి సవాల్ విసిరింది. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచి న్యూఢిల్లీ వరకు పాదయాత్ర చేపట్టాలని కోరారు. ముందుగా బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ తన హయాంలో కరీంనగర్ కు ఏం చేశారో ప్రజలకు వివరించాలి. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ నేతలు చర్చకు రావాలి అని బానోతు ప్రకాశ్ కోరారు.

‘బీజేపీకి ఓటేస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందని బీజేపీ నేతలు చెప్పడం లేదు. బండి సంజయ్‌తో సహా పార్టీ నాయకులు నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దురుద్దేశపూరిత ప్రచారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తురన్నాని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప, తెలంగాణ ప్రగతికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక వారి వద్ద లేదని మండిపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదని గుర్తు చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణలో 100కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు లేనందున తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నారు.

  Last Updated: 18 Nov 2022, 01:02 PM IST