Site icon HashtagU Telugu

Munugode TRS: మునుగోడు మొనగాడు కూసుకుంట్ల.. టీఆర్ఎస్ దే విజయం!

Kcr

Kcr

మునుగోడు ఓట్ల‌ కౌంటింగ్ ఉత్కంటను రేకిత్తిస్తోంది. రౌండ్ రౌండ్ కు టీఆరెస్ తన ఆధిక్యతను మెల్లెగా పెంచుకుంటూ పోతూ ఉంది. పదవ‌ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ 4416 మెజార్టీ కి చేరుకుంది. మొదటి రౌండ్ లో టీఆరెస్ కు 1292 ఓట్ల మెజార్టీ రాగా రెండవ‌ రౌండ్ కు వచ్చేసరికి కాస్త తగ్గి 451 ఓట్లు, మూడవ రౌండ్ లో మరింత తగ్గి 415, నాలుగవ రౌండ్ లో మళ్ళీ పెరిగి 714, ఐదవ రౌండ్ లో 1531 , ఆరవ‌ రౌండ్ లో 2169, ఏడవ రౌండ్ లో 2568, ఎనిమిదవ రౌండ్లో 3100,తొమ్మిదవ రౌండ్ లో 3925 , పదవ రౌండ్ ముగిసే సరికి 4416 మెజార్టీకి చేరుకుంది టీఆరెస్. క్రమ క్రమంగా టీఆరెస్ మెజార్టీ పెరుగింది.

ఇంకా లెక్కించాల్సిన ఒట్లు 5 రౌండ్లే ఉండటంతో తమ గెలుపు ఖాయమైనట్టే అని టీఆరెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. 11, 12 రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఇప్పటివరకు 13 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. 13 వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా రెండు రౌండ్స్ మిగిలిఉండటంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయమైంది.

 

Exit mobile version