Site icon HashtagU Telugu

Dharna Chowk: ధర్నా చౌక్ లో అడుగుపెట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆ పార్టీ నేతలు

తెలంగాణ రాష్ట్రం రాకముందు ధర్నాచౌక్ లో టీఆర్ఎస్ పార్టీ అనేక ధర్నాలు చేసింది. ఆ నిరసనల్లో పాల్గొనడానికి వచ్చే ఆ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నామని గర్వం ఉండేది. ఏడేండ్ల తర్వాత టీఆర్ఎస్ మళ్ళీ ధర్నాచౌక్ లో రైతుల విషయంలో కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తోంది. ఇప్పుడు ధర్నా చౌక్ వచ్చే ఆ పార్టీ లీడర్లు,కార్యకర్తలు నామోషీగా ఫీల్ కావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

Also Read :కేసీఆర్ అబ‌ద్ధాల‌పై కేంద్రం ఫోక‌స్

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ధర్నాలు ఎందుకు? ధర్నాచౌక్ ఎందుకు? అంతగా ధర్నాలు చేయాలనుకుంటే నగరం శివార్లలో చేసుకోవాలి. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ఉండడం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే కారణంతో 2016లో ధర్నా చౌక్ ఎత్తేసింది. ప్రజా పోరాటాలు, లీగల్ ఫైట్ చేసిన తర్వాత 2018 నవంబర్ 13న ధర్నా చౌక్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ధర్నా చౌక్ వద్దని టీఆర్ఎస్ ఖరాకండిగా వాదించి సభలు, సమావేశాలు, ధర్నాలు నిషేదించిన స్థలంలోనే ఇప్పుడు అదే పార్టీ ధర్నా నిర్వహిస్తుండడంపై ఆ పార్టీపై సెటైర్స్ వేస్తున్నారు.

ఇప్పటికైనా ధర్నా చౌక్ అవసరం గుర్తించినందుకు టీఆర్ఎస్ పార్టీని అభినందించాల్సిందే.

Exit mobile version