KCR: ధర్నా చౌక్ కి కేసీఆర్, ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే

వరిధాన్యం విషయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించారు.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 11:56 PM IST

వరిధాన్యం విషయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించారు. రైతులు ఇబ్బందిపడుతున్నా కేంద్రం మొండిగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల విషయంలో టీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ మాట్లాడిన విషయాలు మీకోసం.

1. ఈనెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ ధర్నా చేపట్టనుంది. ఉదయం 11గంటలకు ధర్నా మొదలై మూడు,నాలుగు గంటలపాటు ధర్నాచేసి, తర్వాత గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇస్తాం. ఈ ధర్నాలో మా పార్టీ అన్ని స్థాయిల ప్రజాప్రథినిధులు పాల్గొంటారు. ధర్నా తర్వాత రెండు రోజులు కేంద్రానికి డెడ్ లైన్ పెట్టి, అప్పటికీ కేంద్రం ఒక స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.

2. రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు విషయం లో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తుంది. కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతిని అవలంబిస్తోంది. పంజాబ్ లో ధాన్యం అంతా కొని ఇక్కడ ఎందుకు కొనరు?

3. వరిధాన్యం విషయంలో స్వయానా నినే ఢిల్లీ వెళ్లి, సంవత్సరం కు ఎంత ధాన్యం కొంటారో చెప్పమని కేంద్రాన్ని అడిగాను. ఐదారు రోజుల్లో చెపుతాం అన్నారు కానీ ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు. వర్ష కాలం పంట పై కూడా కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇవన్నీ చూసే రైతులకు వేరే పంటలు వెయ్యమని మా మంత్రి చెప్పారు.

4. రాష్ట్ర బీజేపీ నేతలు వరి వెయ్యమని రైతులకు చెప్తోంది. కేంద్రం కొనమని చెప్తోంది అని కేంద్రమంత్రిని అడిగితే, రాష్ట్ర బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదని కేంద్ర మంత్రి తెలిపారు.

5. 6600ల పై చిలుకు కొనుగోలు కేంద్రాలు పెట్టి మేం ధాన్యం కొంటున్నాము. బీజేపీ నేతలు అక్కడికి వెళ్లి డ్రామాలు చేస్తుంటే రైతులు ఆగ్రహం తో బీజేపీ నేతలను అడ్డుకుంటున్నారు.
బీజేపీ నేతలు రైతులపై దాడులు చేస్తున్నారు.

Also Read: ‘రూటు’ మారుస్తున్నగంజాయి మాఫియా…’ఆన్ లైన్’ అడ్డాగా న‌యా దందా

6. రైతుల పై దాడులు క్షమించరాని నేరం. దీని ద్వారా బీజేపీకి పతనమే తప్పా లాభం లేదు. టీఆర్ఎస్ నేతలు రైతుల రూపంలో వచ్చి బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారని ఆరోపించడం హాస్యాస్పదం. టిఆర్ఎస్ కార్యకర్తల్లో రైతులు ఉంటారు కదా. టిఆర్ఎస్ కార్యకర్తలు తప్పకుండా నిలదీస్తారు.

7. రేపు ప్రధానికి లేఖ రాస్తున్నా. బీజేపీ నేతలు రైతులను కన్ఫ్యూజ్ చేసి చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల విషయంలో బీజేపీ ద్వంద ప్రమాణాలను పాటిస్తోంది. బండి సంజయ్ యసంగిలో వరి వెయ్యండి అని చెప్పవా?లేదా? రెండు మూడు రోజుల్లో కేంద్రం సమాదానం చెప్పాలి.

Also Read: చంద్రుడిపై 800కోట్ల మందికి ల‌క్ష ఏళ్ల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్‌.. కానీ..

8. యాసంగి పంటకు రైతు బంధు డబ్బులు యధావిధిగా ఇస్తాం. కానీ పంటను కేంద్రం కొంటుందనే నమ్మకం లేదు. మాయమాటలు నమ్మి రైతులు మెకేసపోవద్దు.
18 ధర్నా తరువాత రెండు రోజులు ఎదురుచూసి కొనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తాం.

9. నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నాం. బీజేపీని వదిలిపెట్టం. వెంటాడుతాం. వేటాడుతాం. తలా, తోక లేకుండా మాట్లాడేపార్టీ బీజేపీ. బీజేపీది పూటకో మాట, రాష్ట్రానికి ఒక నీతి.

10. తెలంగాణ ఉద్యమాల గడ్డ. డిమాండ్లు సాదించుకునేదాకా కేంద్రంతో కొట్లాడుతూనే ఉంటాం. వరిధాన్యంపై స్పష్టత వచ్చాక, కేంద్రం ఇతర ప్రజావ్యతిరేక విధానాలపై తప్పకుండా మా పోరాటం సాగుతుంది.