తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రౌడీలు మకాం వేసి ఉంటున్నారని ఆరోపించారు.
బుధవారం రాత్రి పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను బెదిరించి ఓటర్లకు డబ్బులు పంచే వరకు వెళ్లారని ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను సైతం టీఆర్‌ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఓటర్లు ఎలాంటి బెదిరింపులకు భయపడరని, ఆఫర్లకు ఆకర్షితులు కావొద్దని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. కాగా మునుగోడు నియోజకవర్గం, నారాయణపూర్ మండలంలోని తన స్వగ్రామమైన లింగవారిగూడెంలో ఓటు హక్కు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వినియోగించుకున్నారు.