Site icon HashtagU Telugu

TRS Social media game: ఆపరేషన్ ‘ ఘర్ వాపసీ’ అలజడి

Whatsapp Image 2022 10 22 At 2.39.19 Pm

Whatsapp Image 2022 10 22 At 2.39.19 Pm

జాతీయ పార్టీ బీ ఆర్ ఎస్ కోసం కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలోని పరిచయం ఉన్న ప్రతి ఒక్కర్ని దగ్గరకు తీసుకునే పనిలో ఉన్నారు . అవసరం అయితే చంద్రబాబు తో  కలిసి  నడవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. కనీసం 40 మంది ఎంపీలను పోగు చేసుకోవాలని 2024 దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అందుకే, ఏపీ ,తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా పంజాబ్ , యూపీ మీద ఆయన ఆశలు పెట్టుకున్నారు . ఇప్పటికే  ఢిల్లీ కేంద్రం గా ప్రశాంత్ కిశోర్  తో పావులు కదుపుతున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసే ఎత్తుగడ వేస్తున్నారు. టీఆర్ ఎస్  2023 ఎన్నికల కోసం అనే సంకేతాన్ని కేటీఆర్ ఇచ్చేసారు. 2024 ఎన్నికల కోసం బీఆర్ ఎస్ అనే సంకేతం ఇచ్చారు. ఆ క్రమంలో ఇప్పటినుంచే కేసీఆర్ పూర్వపు పరిచయస్తుల్ని దగ్గరకు తీసుకుంటున్నారు.

ప్రధానంగా బీజేపీ లీడర్ల మీద కేసీఆర్ ఆపరేషన్ షురూ చేశారు. ఆ క్రమం లో మైండ్ గేమ్ ను బీజేపీ నాయకత్వంఫై ప్రయోగిస్తోంది. టీఆర్ఎస్ సోషల్ మీడియా కొండావిశ్వేశ్వర రెడ్డి విజయశాంతి , ఈటెల , జితేందర్రెడ్డి తదితరులు తిరిగి టీఆర్ ఎస్ కు వస్తున్ననారని ప్రాచారం చేస్తుంది.  ఇదీ తీవ్రమైన కుట్రగా బీజేపీ భావిస్తుంది. బీజేపీ నుంచి వీడిపోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీలోని సీనియర్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీతో దూరం వెళ్లిపోవాల్సినంత భేదాభిప్రాయాలు లేవని విజయశాంతి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీపై విజయశాంతి ఫైరయ్యారు. ఆమెపై చేస్తోన్న అసత్య ప్రచారాలను తప్పుపట్టారు. రాష్ట్ర బీజేపీతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. కొందరు కావాలనే లేని పోనివి ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. తనకు సంబంధించి ఏదీ దాపరికం లేదని, కానీ టీఆర్ఎస్ సోషల్ మీడియా తనను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు.

ఎన్నికల వేళ బీజేపీకి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్వామిగౌడ్, దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరికొందరు నేతలు గులాబీ గూటికి చేరబోతున్నారు. అయితే ఈటల రాజేంధర్ ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీని వీడనున్నారని ఊహాగానాలు వస్తోన్నాయి. ఇదీ బీజేపీకే కాక.. ఈటల రాజేందర్‌కు షాక్. ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్‌తో కలిసి పార్టీని వీడారు. ఈటలతో తుల ఉమ, తదితర ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనను పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. 2018 ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోగా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించారు. అదీ జరగలేదు. పైగా  కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి జాజాలా సురేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం బాధ్యతలను టీఆర్ఎస్ నాయకత్వం సురేందర్‌కు అప్పగించింది. ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. అప్పుడు పార్టీని వీడటానికి ఇదీ కూడా ఒక కారణమే. పార్టీ సభ్యత్వ నమోదులో కూడా ఏనుగు రవీందర్ రెడ్డికి ఏ విధమైన పాత్ర లేకుండా చేశారు. ఈటల రాజేందర్ వెంట నడవడానికి సిద్ధపడ్డారు. కానీ అదీ కూడా ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. తిరిగి ఆయన సొంత గూటికి చేరబోతున్నారు.  ఏనుగు రవీందర్‌రెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇలా పలువురు బీజేపీ ని వీడుతున్నారాని ప్రకారం జరుగుతుంది . వాటిలో కొన్ని  నిజాలు ఉండటంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు కూడా త్వరలోనే జంపు కానున్నారని నమ్మే వాళ్ళు లేకపోలేదు. జితేందర్ రెడ్డి , విజయశాంతి , ఈటెల మాత్రం ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నప్పటికీ సోషల్ మీడియా ఆపరేషన్ ఘర్ వాపసీ  న్యూస్ ను హోరెత్తిస్తుంది.

Exit mobile version