Site icon HashtagU Telugu

TRS Records : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

Trs Mlc

Trs Mlc

తెలంగాణలో నేడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 12 స్థానాలకు గాను 6 ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థానాలకు డిసెంబరు 10 న ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో ఎల్. రమణ, భానుప్రసాద్ విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటల రాజేందర్ తరపున స్వతంత్ర అభ్యర్థిగా దిగిన రవీందర్ సింగ్ ఘోర ఓటమి చవిచూశారు. మొత్తం 12 స్థానాలు తెరాస అభ్యర్థులు గెలవడం తో ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్ రావు 584 , ఎల్ రమణ 479 ఓట్లు సాధించారు. యాదవ రెడ్డి(మెదక్) 762, టాటా మధు(ఖమ్మం) 480 , కోటి రెడ్డి (నల్లగొండ)917, విట్టల్ (ఆదిలాబాద్) 740 ఓట్లు సాధించారు.

కల్వకుంట్ల కవిత (నిజామాబాద్ ), పట్నం మహేందర్ రెడ్డి , శంబీపూర్ రాజు (రంగారెడ్డి ), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్) దామోదర్ రెడ్డి, కాసిరెడ్డి (మహబూబ్ నగర్ ) ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు.