Site icon HashtagU Telugu

TRS Dharna : యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ అంతటా టీఆరెస్ ధర్నా

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌  పిలుపు మేరకు ఈ ఆ పార్టీ శ్రేణులు ఈ ధర్నాలను చేపట్టాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని (paddy yield) కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని నేతలు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
YouTube video player

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుదంటూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్- ఖమ్మం హైవేపై రాయపర్తి మండల కేంద్రం వద్ద టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనేవరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు.

తెలంగాణ రైతులపై  కేంద్రం కక్ష్య కట్టిందంటూ మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. సూర్యపేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల జేబులు నింపుతుంటే ప్రధాని మోదీ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.

Exit mobile version