Pressmeet : మోదీ వెనక్కి తగ్గటాన్ని హర్షిస్తున్నం : టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేయడాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 19, 2021 / 05:24 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేయడాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పి.రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ లు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వాళ్లంతా మాట్లాడుతూ వ్యవసాయం చట్టాల రద్దు కోరుతూ ఉద్యమం చేసిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులకు అండగా ఉంటానని సీఎం కేసీఆర్ ధర్నా చేయటం దేశంలో కదలిక వచ్చిందని అన్నారు. కేసీఆర్ బాటలోనే నడవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారని, బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం వరి ధాన్యం కొనే విధంగా ఒక చట్టం తేవాలని, కేంద్రం ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకుని ఉంటే రైతులు చనిపోయేవారు కాదని అన్నారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడంలో కేసీఆర్ పాత్ర ఉందని, రాష్ట్ర బిజెపి నేతలకు బడిత పూజ తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర బిజెపి నేతలకు విషయ పరిజ్ఞానం లేదనీ, ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదించిన మంచిది కాదనీ, బండి సంజయ్ రైతు పక్షపాతి అయితే కేంద్రం మెడలు వంచి యాసంగి వడ్లను కొంటామని ఉత్తర్వులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను వాడుకోకుండా, విద్యుత్ చట్టాలను కూడా కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎంపీలు కోరారు.