Site icon HashtagU Telugu

TRS : టీఆర్ఎస్ ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

Trsmps

Trsmps

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని… ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వరి మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వమే ప్రొత్సహించింది. కానీ ఈ ఏడాది మాత్రం వరి సాగు చేయవద్దని… అలా చేస్తే… ధాన్యం కొనుగోలు బాధ్యత మాకు సంబంధం లేదని తేల్చి చెప్పేంది. అయితే వ‌డ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామ‌ని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆయన ధర్నాకు సైతం దిగారు. కేంద్రం బురద చల్లే ప్రయత్నం చేస్తుందని, బీజేపీ నాయకులు అమాయక రైతులతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరి కొనేలా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో మూడవరోజూ కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌ చేశారు. ప్లకార్డులు పట్టుకొని రైతులను శిక్షించొద్దు అంటూ నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పార్లమెంట్ ను స్తంభింపచేశారు. లోక్‌సభలో విపక్ష సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు తమ ఆందోళ కొనసాగించడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. ఇదే అంశంపై బుధవారం కూడా లోకసభలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.