Site icon HashtagU Telugu

Loksabha : ధాన్యం కొనుగోళ్లపై చర్చకు TRS పట్టు..

Trs Mps In Loksabha

లోక్​సభలో టీఆరెస్ఎంపీలు ఆందోళన చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. పార్లమెంట్​లో తొలిరోజే ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం మొదలు కాగానే.. ధాన్యం కొనుగోళ్లపై టీఆరెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో టీఆరెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీ నామ నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో టీఆరెస్ స‌భ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను వాయిదా వేశారు.

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు(Parliament winter sessions) ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు. దీంతో తొలిరోజే ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మొదట సభలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు నివాళి అర్పించారు. లోక్​సభలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్​ ఓం బిర్లా. దానిని విపక్షాలు అడ్డుకున్నాయి. రైతు సమస్యలు సహా ఇతర ప్రజాసంక్షేమ అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. సహకరించాలని విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవటం వల్ల సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్​. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ(Parliament winter sessions) విపక్షాలు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో కొత్త సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) లోక్​సభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్​ను తిరస్కరించిన స్పీకర్​ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు