టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ కాంగ్రెస్‌లో చేరే తరుణం ఆసన్నమైంది. ఈ నెల 24న ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
గతంలో డీఎస్ 1989 నుంచి 2015 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారని.. తనకు సరైన గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించిందని డీఎస్టీఆర్ ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన డీఎస్ పలు కారణాలతో కేసీఆర్ కు దూరమయ్యారు. డీఎస్ పదవీ కాలానికి ఇంకా ఐదు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? మరి టీఆర్ఎస్ పార్టీ ఆయనపై అనర్హత వేటు వేస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.
డీఎస్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసి బరిలోకి దించి అద్భుత ఫలితాలు సాధించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.