MLC Kavitha: సెప్టెంబరు 17న‌ ఆదివాసీ, బంజారాలు పెద్ద ఎత్తున తరలి రావాలి!

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీ, బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

  • Written By:
  • Updated On - September 10, 2022 / 09:25 PM IST

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీ, బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సందర్భంగా, ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు హైధరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ,సెప్టెంబర్ 17 న లక్షలాది మంది ఆదివాసీలు, బంజారాల సమక్షంలో, హైదరాబాద్ లో ఆదివాసీ, బంజారా భవన్ లను సీఎం కేసీఆర్ ప్రారంభించున్నారని, నిజామాబాద్ నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వాలు ఏ ఒక్క ఎస్టీ గుడికి దూపదీప నైవేద్యాలు ఇవ్వలేదన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ హయంలో అనేక ఆదివాసీ దేవాలయాలకు దూపదీప నైవేద్యాలు అందించామన్నారు. అనేక గుడులకు దేవాదాయ శాఖ నుండి నిధులు విడుదల చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. భారతదేశంలో సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారకంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గారు 84 కులాలకు హైదరాబాద్ నగరంలో ఆత్మ గౌరవ భవనాలు నిర్మించి, ప్రతి ఒక్క కులానికి సమున్నత గౌరవం కల్పిస్తున్నారన్నారు. అంతేకాదు మరో 15 కులాల భవనాలు కూడా నిర్మిస్తున్నామన్నారు. అన్ని కులాలకు సంబంధించిన సంక్షేమంలో, పార్టీలకతీతంగా అందరం కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ , ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్, ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.