Kavitha React: ‘లిక్కర్ స్కామ్’ పై కవిత క్లారిటీ!

దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత

Published By: HashtagU Telugu Desk
Kavitha

Kavitha

దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత ప్రెస్ మీటి పెట్టి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు అని కవిత మండిపడ్డారు. నిరాధారంగా మాట్లాడటం ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని హితవు పలికారు. ’’కేసిఆర్ బిడ్డను బద్నాం చేస్తే, కేసీఆర్ ఆగమైతడని, కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కేసీఆర్ భయపడుతారేమో అని, బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది పూర్తి వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుంది. తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని సంవత్సరాలలో, మా కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినా, మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం.. ఇటువంటి వాటికి భయపడేది లేదు‘‘ అని కవిత హెచ్చరించారు. ‘‘భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు.. మేమంతా వారు చూపించిన బాటలోనే నడుస్తాం. భయపడేది లేదు… బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు.. దీన్ని ప్రజలంతా గమనించాలి’’ అంటూ కవిత మీడియాలో సమావేశంలో పేర్కొన్నారు.

  Last Updated: 22 Aug 2022, 01:38 PM IST