హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి దారుణ ఘటన జరిగింది. నిషాఅనే వివాహితపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఎ బీరు సీసాతో దాడి చేశాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ కేసులో టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ బాబా ఫసియుద్దీన్ పేరు తెరపైకి వచ్చింది. బాబా ఫసియుద్ధీన్ కుట్ర పూరితంగా ఇదంతా చేశాడంటూ మాగంటి గోపీనాథ్ పీఎ విజయ్ సింహా ఆరోపిస్తున్నాడు.
బాబా ఫసియుద్దీన్ దగ్గర తను గతంలో పనిచేశానని..అతని మోసాలు తనకు తెలిసి అతనికి దూరంగా ఉన్నానని చెప్పాడు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నాని…నా ఎదుగుదల చూసి ఓర్వలేకే ఆయన కుట్ర పన్నారని ఆరోపించాడు. నిషా అనే మహిళకు మూడు లక్షలు ఇచ్చి…ఇలా చేయించి…ఫసియూద్ధీన్ కేసు పెట్టించాడన్నారు. పోలీసుల దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను తప్పు చేసినా అని తేలితే జైలుకు వెళ్లేందుక సిద్ధంగా ఉన్నానని విజయ్ సింహా చెప్పాడు.