Site icon HashtagU Telugu

TRS MLA : వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్..!!

Danam Nagendar

Danam Nagendar

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదంలో ఇరుక్కున్నారు. కోట్లాది మంది పూజించే ఖైరతాబాద్ వినాయడికి చెప్పులు వేసుకుని పూజలు నిర్వహించారు. మంగళవారం ఎమ్మెల్సీ కవితతోపాటు దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం దేవుళ్ల దగ్గరకు వెళ్లే సమయంలో కాళ్లకు చెప్పులు ఉండకూడదు. దీనికి విరుద్ధంగా దానం నాగేందర్ వ్యవహారించారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా దానం నాగేందర్ చెప్పులతో వినాయకుడికి పూజలు చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. ఇదేనా కోట్లాది మంది భక్తులు కొలిచే గణేషుడికి మీరిచ్చే విలువ అంటూ ప్రశ్నిస్తున్నారు.