Telangana : టీఆర్ఎస్ నేతలపై బీజేపీ సోషల్ వింగ్ తప్పుడు ప్రచారం

దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు ఆయన అడిషనల్ డిజి జితేందర్ కు ఫిర్యాదు చేశారు.

  • Written By:
  • Updated On - November 19, 2021 / 04:40 PM IST

దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు ఆయన అడిషనల్ డిజి జితేందర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్  ఎమ్మెల్యేలపై ఫేక్ వీడియో తయారు చేశారని, సోషల్ మీడియాలో టిఆర్ఎస్ నేతలపై బీజేపీ సోషల్ వింగ్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను, ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని, మాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మీ ఆడవారి మీద ఫేక్ వీడియోలు తయారు చేయాలంటే ఒక్క నిమిషం పట్టదని, కానీ మాకు సంస్కారం ఉందని, అందరికి కుటుంబాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, గువ్వల బాలరాజు మీద , చాలా ఫేక్ వీడియోలు పెట్టారని, దళిత నేతల ఎదుగుదల చూసి బీజేపీ ఓర్చుకోవడం లేదని పేర్కొన్నారు. చట్ట ప్రకారం సోషల్ మీడియాలలో పోస్టులు పెడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియాలలో ఫేక్ వీడియో లో పెడుతున్న వారిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలి. బండి సంజయ్ నుండి ఈటెల వరకు ఎవర్ని వదలమని, అభివృద్ధి మీద సంక్షేమం మీద కొట్లాడాలి కానీ చిల్లర రాజకీయాలు చేయొద్దు సుమన్ సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే అరూర్ రమేష్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో దళిత నేతలను బీజేపీ టార్గెట్ చేస్తుందని, దీనిపై అడిషనల్ డిజి కి ఫిర్యాదు చేశామని అన్నారు. బీజేపీ నాయకులు డైరెక్ట్ గా ఎదుర్కొనలేక తప్పడు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బుద్ధి మార్చుకోవాలని, పోలీసులు చర్యలు తీసుకోక పోతే మేమే వారి అంతు చూస్తామని ఆయన అన్నారు.