Site icon HashtagU Telugu

TS: ఎమ్మెల్యే బాల్కసుమన్ అభిమాని ఓవరాక్షన్..ఏం చేశాడో తెలుసా..?

TRS balka suman

TRS balka suman

అభిమానానికి హద్దులు ఉండాలి. హద్దులు దాటితే…పిచ్చే అంటారు. కొందరు తమ అభిమాన నేతలపై అభిమానం ఓ రేంజ్ లో చూపిస్తుంటారు. ఇలాంటి ఓవరాక్షన్ ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అలాంటిదే జరిగింది మంచిర్యాల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అభిమానికి. కొప్పులు రవి..అనే వ్యక్తి…తుపాకీ బుల్లెట్స్ తో జై బాల్క సుమన్ అంటూ పేర్చాడు. అంతడితో ఊరుకోలేదు…దానిని వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఇది క్షణాల్లో వైరల్ అయ్యింది. అది కాస్త పోలీసులకు చేరింది. పోలీసులు ఊరుకుంటారా..అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. శ్రీరాంపూర్ డివిజన్ లో సింగరేణి కార్మికుడిగా రవి పని చేస్తున్నాడు. ఓ సాధారణ కార్మికుడికి తుపాకీ బుల్లెట్లు ఎలా వచ్చాయి…ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై పెద్దెత్తున చర్చ జరుగుతోంది.

Exit mobile version