TRS : అమరులైన రైతు కుటుంబాల బాధ్యత కేంద్రమే తీసుకోవాలి!

మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషమని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ముందే ఈ నిర్ణయం తీసుకుంటే రైతుల ప్రాణాలు దక్కేవనీ, అమరులైన కుటుంబాలను ఆదుకునే భాద్యత కేంద్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Written By:
  • Publish Date - November 19, 2021 / 01:02 PM IST

మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషమని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ముందే ఈ నిర్ణయం తీసుకుంటే రైతుల ప్రాణాలు దక్కేవనీ, అమరులైన కుటుంబాలను ఆదుకునే భాద్యత కేంద్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం దేశంలో పలుచబడుతోంది భావించిందని, గత నెల రోజుల నుంచి టీఆరెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై పోరాటం చేస్తోందని, తెలంగాణ సాధనలో కేసీఆర్  పాత్ర ఏంటో మోడీకి తెలుసు అన్నారు. రైతులకు క్షమాపణ చెప్పడం మోడీ గొప్ప మనసును ఒప్పుకుంటున్నామని అన్నారు.

ఇది ప్రజల విజయం- నిరంజన్ రెడ్డి

నల్లచట్టాలకు కాంగ్రెస్ పురుడు పోస్తే, పెంచిపోషించింది బీజేపీ తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు లో ఆకలి కేకలు ఇంకా ఉన్నాయని చెప్తోందని, దేశంలో వస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలని అన్నారు. శాంతకుమారి కమిటీ నివేదికలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని, దేశంలో ఆహార ఉత్పత్తులను రెగ్యులేట్ చేయడం కేంద్రానికి చేతకాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కార్పోరేట్ రంగాలపై ఎక్కువ మక్కువ చూపడం వల్లే ఇవ్వాళ ఈ సంక్షోభం వచ్చిందని చెప్పారు. 6 లక్షల కోట్లు బ్యాంక్ లకు కార్పొరేట్లు ఎగపెడితే కేంద్రం మాఫీ చెయ్యలేదా? అని ప్రశ్నించారు. పంటలు వేయొద్దు అంటే ప్రజల ఉపాధి కోల్పోఎందుకు మొదటి అడుగు వేసినట్టేనని అన్నారు. పంట కొనుగోళ్లను ఆర్థికకోణంలో చూడొద్దని, సామాజిక కోణంలో చూడాలని సూచించారు. తెలంగాణ లో అతి ఎక్కువ విస్తారంలో పంటలు వస్తాయని, స్టాక్స్ ఎక్కువ అయితే పంటను కొనరా? ప్రత్యామ్నాయ ఆలోచన చెయ్యదా కేంద్రం? మంత్రి ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయం : మంత్రి జగదీశ్ రెడ్డి

కేసీఆర్ నాయకత్వం రైతులకు దొరుకుతుందని భయమే ప్రధాని ప్రకటన అని మేము భావిస్తున్నామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు లేకనే ఇన్ని రోజులు సాగిందన్నారు. చట్టాలు ఉపసంహరణ చేసినంత మాత్రాన టీఆర్ఎస్ పోరాటం ఆగదని, రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు కేసీఆర్ ఉద్యమం చేస్తారని గుర్తుచేశారు. విద్యుత్ చట్టాలను మోడీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.