Site icon HashtagU Telugu

TRS : 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నాలు

TRS

TRS

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చింది. శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తమ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను కొనసాగించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ సమావేశాలు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సన్నిహితంగా ఉండటమే కాకుండా నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి కూడా దోహదపడతాయని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఈ ఆత్మీయ స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డం మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంలో ముఖ్య‌పాత్ర పోషించింది. గ్రామీణ నియోజకవర్గాల్లో ఒకేసారి రెండు మండలాలను తీసుకుని సమావేశాలు నిర్వహించనున్నారు. ఉద‌యం జరిగే సమావేశానికి సంబంధిత ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జి హాజరవుతారని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంభాషిస్తారని పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. నగరాల్లో జ‌రిగే ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి పార్టీ నాయకులు ప్రతి ఆరు నుంచి ఏడు వార్డులకు ఒక సమావేశం నిర్వహిస్తారు. కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు నవంబర్ 27న సర్వసభ్య సమావేశం జరగనుంది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.