TRS On Eatala:70 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఈటల ముక్కు భూమికి రాయాలి

హుజురాబాద్ ఉపఎన్నికలు ముగిసి నెలలు గడుస్తోన్నా ఈటల రాజేందర్ పై రాజకీయ విమర్శలు, ఒత్తిళ్లు తగ్గడం లేదు.

హుజురాబాద్ ఉపఎన్నికలు ముగిసి నెలలు గడుస్తోన్నా ఈటల రాజేందర్ పై రాజకీయ విమర్శలు, ఒత్తిళ్లు తగ్గడం లేదు.
ఈటల కు సంబందించిన జమున హ్యాచరీస్ కోసం భూములు కబ్జా చేసినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికల్లో తేల్చారు. దీనితో మరోసారి ఈటలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు మొదలుపెట్టారు.

పేదల భూములు కబ్జా చేసినట్లు నిరూపణ జరిగినందున ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములను ఈటల కబ్జా చేశారని ప్రభుత్వం దగ్గర పక్కా ఆధారాలుండి బాధ్యతతో ఆయనపై చర్యలు తీసుకుంటే ఈటల తన అబద్దాలతో ప్రభుత్వంపై విమర్శలు చేశారని బాల్క సుమన్ విమర్శించారు.

దాదాపు‌ 70 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేసినట్లు తేలిందని, ఆ భూములు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని సుమన్ డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఈటల రాజేందర్‌ చేసిన తప్పులను ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేసిన సుమన్, భూకబ్జా కేసులో చట్టపరంగా ఈటలపై చర్యలుంటాయని తెలిపారు.