Site icon HashtagU Telugu

Munugode By Poll : బీజేపీపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు…!!

Trs Bjp

Trs Bjp

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయ వేడిని మరింత రాజేశాయి. ఉపపోరులో ప్రధాన పార్టీలు మాటల యుద్ధానికి తోడు…టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పెనుసంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈసీకి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మునుగోడు ఓటర్లు ప్రలోభపెట్టేందుకు బీజేపీ రూ. 5.22కోట్లను పలువరు బ్యాంకు అకౌంట్లలో జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది టీఆర్ఎస్. డబ్బులు వేసిన 23 బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన వివరాలను కూడా ఎన్నికల కమిషన్ కు అందించింది. ఈ అకౌంట్లన్నీ మునుగోడుకు సంబంధించినవే అని పేర్కొంది.

కాగా బీజేపీ ముందు నుంచి టీఆర్ఎస్ ఫిర్యాదులు చేస్తూనే వస్తోంది. మునుగోడు ఉపఎన్నిక ప్రభావితం చేసేందుకు అధికారపార్టీ ప్రయత్నిస్తోందని…ఫాం హౌజ్ డ్రామా కూడా ఇందులో భాగమే అంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాుద చేసింది. అధికారపార్టీ ఆగడాలను ఈసీ అడ్డుకోవడం లేదంటూ ఆరోపిస్తోంది బీజేపీ. కాగా బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ . టీఆర్ఎస్ ఎన్నికల నియామళిని ఉల్లంఘిస్తోందని తెలిపారు.

Exit mobile version