Site icon HashtagU Telugu

Munugode Result: ‘మునుగోడు’లో టీఆర్‌ఎస్‌ విజయం.. కాంగ్రెస్‌కు డిపాజిట్‌ గల్లంతైంది

Munugode Imresizer

Munugode Imresizer

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. బీజేపీపై టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.
ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. మునుగోడు.. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి, ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీపడ్డారు. అయితే, బీజేపీ రెండో స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ నిర్ణీత ఓట్లు కూడా సాధించకపోవడంతో డిపాజిట్ కోల్పోయింది. రాజగోపాల్ రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని గెలవలేకపోయారు.

రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపులో ముందు నుంచి టీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. కాంగ్రెస్ ఎక్కడా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.