పార్లమెంట్ లో తెలంగాణ ‘వరి’ పంచాయితీ

వరిధాన్యం విషయంలో కేంద్రాన్ని వెంటాడుతాం, వేటాడుతామని ప్రకటించిన కేసీఆర్ డైరెక్షన్లో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో తమ నిరసన తెలియచేస్తున్నారు.ఇన్ని రోజులు బీజేపీ పాలసీలకు ఓటేయడమో, న్యూట్రల్ గానో ఉంటూ వస్తున్న టీఆర్ఎస్ బీజేపీతో రాజకీయంగా తేల్చుకుందామని సిద్దమైనట్లు సమాచారం.

వరిధాన్యం విషయంలో కేంద్రాన్ని వెంటాడుతాం, వేటాడుతామని ప్రకటించిన కేసీఆర్ డైరెక్షన్లో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో తమ నిరసన తెలియచేస్తున్నారు.ఇన్ని రోజులు బీజేపీ పాలసీలకు ఓటేయడమో, న్యూట్రల్ గానో ఉంటూ వస్తున్న టీఆర్ఎస్ బీజేపీతో రాజకీయంగా తేల్చుకుందామని సిద్దమైనట్లు సమాచారం. దానిలో భాగంగానే ఈసారి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజు నుండి టీఆర్ఎస్ ఎంపీలు
రైతుల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తన ప్రొక్యూర్మెంట్‌ పాలసీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
ఇదే అంశంపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు
స్పీకర్‌ పొడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకునికేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తారాల సమయంలో కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌ లోకి దూసుకెళ్లి రైతులను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో వరిధాన్యంపై ఒకమాట మాట్లాడుతున్నారు. కానీ పార్లమెంట్ లో వాళ్ళ మంత్రి పీయూష్ గోయల్ మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

వరిధాన్యం విషయంలో తమ ఎంపీలు పార్లమెంట్ లో నిరసన తెలియచేయడం సంతోషంగా ఉందని, ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి రైతుల పక్షాన ఆలోచించాలని ఆయన డిమాండ్ చేసారు.

అందరూ రైతుల పక్షమే అంటున్నారు. కానీ రైతు సమస్య తీరడం లేదు. వరి విషయంలో రైతుల్లో ఉన్న కన్ఫ్యూజన్ కి క్లారిటీ రావట్లేదు. కళ్ల్లాల్లో ధాన్యం పెట్టుకొని కళ్ లుతిరిగేదాకా, కాళ్ళు అరిగేదాకా తిరుగుతున్న రైతుల సమస్య ఎప్పుడు సమిసిపోతుందో చూడాలి.