Seethakka: వాళ్ళది ఏడేండ్లనుండి ఏడడుగుల బంధం అని తెల్పిన సీతక్క

ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వరిదీక్షలో పాల్గొన్న సీతక్క హ్యాష్ ట్యాగ్ ప్రతినిధి సిద్దార్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

కొనుగోలు చేసే నిర్ణయాధికారం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పార్టీలే ధర్నాలు చేసేందుకు సిగ్గుండాలని కాంగ్రేస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వరిదీక్షలో పాల్గొన్న సీతక్క హ్యాష్ ట్యాగ్ ప్రతినిధి సిద్దార్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

చేతిలో అధికారం ఉన్నవాళ్లు ధర్నాలు చేయడం సిగ్గుచేటని, ఇప్పటికైనా టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయాలు పక్కనపెట్టి రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనకుండా రెండు పార్టీలు డ్రామా చేస్తే విదేశీయలు వచ్చి ధాన్యం కొంటారా అని ఆమె ప్రశ్నించారు. ధర్నా చేస్తామని ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ మళ్ళీ గల్లీకి వచ్చేసిందని సీతక్క ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ బీజేపీది ఏడేండ్ల నుండి ఏడడుగుల బంధంగా ఉందని సీతక్క తెలిపారు. కాంగ్రెస్ లో ఎవరికి వ్యక్తిగత ఎజెండాలు లేవని పార్టీ ప్రయోజనాల కోసం, ప్రజల ఉపయోగం కోసం పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని అన్నారు. పార్టీ నాయకులందరూ రైతులకోసం ఒకే వేదికపైకి రావడం సంతోషంగా ఉందని సీతక్క తెలిపారు.