Site icon HashtagU Telugu

Chiranjeevi BRS: టీఆర్ఎస్ ఆకర్ష్.. బీఆర్ఎస్ లోకి చిరంజీవి ఎంట్రీ!

Chiru

Chiru

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లాంటి నేతలు మళ్లీ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి ఆహ్వానం అందింది. ఇందుకు హైదరాబాద్ వేదిక అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ లోకి రావాలంటూ చిరంజీవిని తెలంగాణ మంత్రి ఆహ్వానించారు. అందరి సమక్షంలో ఈ ఆహ్వానం పలికారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. మెగాస్టార్ పైన మంత్రి మల్లారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవిని అన్నయ్యా అంటూ తన మనసులో మాటను మంత్రి బయట పెట్టారు.

తాను జీవితంలో ఏ విధంగా కష్టపడి పైకి వచ్చాననో.. సినీ రంగంలో చిరంజీవి కష్టపడి ఈ స్థాయికి ఎదిగారని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న అంశాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్ కు అండగా నిలవాలని మంత్రి మల్లారెడ్డి అందరి సమక్షం లోనే చిరంజీవిని కోరారు. ప్రజాసేవ చేసేందుకు బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు. కానీ, చిరంజీవి ఏ విధంగానూ మల్లారెడ్డి ప్రతిపాదనకు స్పందించలేదు. కేంద్ర మంత్రిగా – రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలం ముగిసిన తరువాత రాజకీయాలకు చిరంజీవి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి రాజ్యసభ ఇస్తారనే సమయంలో అసలు తనకు రాజకీయాలపైన ఆసక్తి లేదని, తాను తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చిరంజీవి తేల్చి చెప్పారు.

Also Read:   AP Politics: జ‌గ‌న్ మీద ప‌వ‌న్ `ఆడిట్‌` అస్త్రం

గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగ్ గా విడుదల చేసిన రాజకీయాలకు తాను దూరం అయినా, రాజకీయాలను తనకు దూరం కాలేదంటూ చెప్పిన అంశం ఇప్పుడు వాస్తవంగా కనిపిస్తోంది. అదే సమయంలో తమ్ముడు పవన్ కు తాను మద్దతుగా ఉంటానని చిరంజీవి కొద్ది రోజుల క్రితం స్పష్టం చేసారు. ఇప్పుడు మెగాస్టార్ కు ఉన్న ఫ్యాన్ పాలోయింగ్, క్రేజ్ తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉంటున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతల తీరు పట్లు గతంలో పవన్ అసహనం వ్యక్తం చేసారు. తాజాగా పార్టీ నేతల సమావేశంలోనూ తెలంగాణలో పోటీ చేద్దామని పవన్ ప్రకటించారు. బీజేపీతో పవన్ దూరం అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.

అయితే, చంద్రబాబు – పవన్ మధ్య పొత్తు అంశం పైన ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన నేతలు తిరుపతి వేదికగా సమావేశం అయ్యారు. చిరంజీవి తిరిగి రాజకీయంగా క్రియాశీలకంగా మారాలని కోరారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. దీంతో, రాజకీయంగా వస్తున్న అభ్యర్ధనల పైన మెగాస్టార్ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారా.. మార్చుకుంటారా అనేది చూడాలి.

Also Read:   Munugode Bypoll: రాజగోపాల్ కు ఎలక్షన్ కమిషన్ నోటీస్ !

Exit mobile version