Liquor Scam: కవితపై రెచ్చిపోతున్న ట్రోలర్స్.. ‘లిక్కర్ రాణి’ అంటూ ఫొటోలు షేర్!

ఎమ్మెల్సీ కవితపై ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. లిక్కర్ రాణి అంటూ మద్యం ఫొటోలను షేర్ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 11, 2023 / 01:19 PM IST

లిక్కర్ స్కామ్ (Liquor Scam) వ్యవహరంతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఆమె ఈడీ ముందుకు హాజరైంది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు కవితకు మద్దతు పలుకుతూ నినాదాలు చేస్తుంటే, మరోవైపు ట్రోలర్స్, వ్యతిరేక వర్గం ఆమెను లిక్కర్ రాణి అంటూ అభివర్ణిస్తున్నారు. కవిత బతుకమ్మను పేర్చగలరు.. లిక్కర్ దందా చేయగలదు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ కు దిగుతున్నారు. బతుకమ్మ ఎత్తుకున్న ఫొటోలో స్థానంలో మద్యం బాటిల్స్ ఎత్తుకున్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం కవిత (MLC Kavitha) ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

లిక్కర్ తో తెలంగాణ ప్రజలకు ఏసంబంధం

లిక్కర్ స్కామ్ తో కవిత తెలంగాణను తలదించుకునేలా చేసిందనీ బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే విషయమై బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ కూతురు చేసిన మద్యం కుంభకోణం (Liquor Scam)తో తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసమే కవిత అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారా? అక్రమంగా సంపాదించిన డబ్బును పంట రుణాల మాఫీకి ఖర్చు చేస్తున్నారా లేదా ఉద్యోగుల జీతాల చెల్లింపుకు లేదా నిరుద్యోగ భృతికి ఖర్చు చేస్తున్నారా? బండి సంజయ్ అడిగాడు. తెలంగాణ ప్రజలు దేశంలో ఎవరి ముందు తలవంచలేదని పేర్కొన్న సంజయ్, కేసీఆర్ కుమార్తె అక్రమ మద్యం కుంభకోణం కారణంగా ఇప్పుడు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి

లిక్కర్ స్కామ్ కు కవిత (MLC Kavitha) రాజకీయ రంగు పులుముతున్నారని, తెలంగాణ సెంటిమెంట్ కు ఏ సంబంధమని ఇతర పార్టీల నాయకులు అంటున్నారు. ‘‘లిక్కర్ స్కాంతో తెలంగాణ సెంటిమెంట్‌కు ఏం సంబంధం.. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి.. కవితకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా? విచారణను ఎదుర్కోవాల్సింది పోయి తెలంగాణకు అవమానం అంటున్నారు’’ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.