Tritiya Jewellers : బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెల్లరీ యజమాని కాంతిదత్ ఏకంగా పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలకు కుచ్చుటోపీ పెట్టాడు. అతడి మాటలు నమ్మి ఆర్థికంగా మోసపోయిన వారిలో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి తదితర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. కాంతిదత్ మోసం చేసిన వారి సంఖ్య దాదాపు 100 మందికిపైనే ఉంటుందని తెలుస్తోంది. తన జ్యువెల్లరీ వ్యాపారానికి పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ చాలామంది నుంచి కాంతిదత్ పెట్టుబడులు సేకరించాడు.
Also Read :Prisoner Escaped : నకిలీ బెయిల్ పత్రాలతో చంచల్‌గూడ జైలు నుంచి ఖైదీ పరార్
ఈవిధంగానే శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త కూడా పెట్టుబడిని అందించారు. చివరకు ఆమె మోసపోయానని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో కూడా కాంతిదత్‌పై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద కాంతిదత్‌ను పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు. అతడు పరిణీతి చోప్రా సహా పలువురి సంతకాలను ఫోర్జరీ చేశాడని అంటున్నారు. పలువురు హీరోయిన్లు, వ్యాపారవేత్తల నుంచి కాంతి దత్ దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
Also Read :Porn Racket Case : సినిమా ఛాన్స్ పేరుతో దగా.. యువతులతో పోర్న్ మూవీస్.. రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు
కాంతిదత్(Tritiya Jewellers) గతంలో సస్టెయిన్ కార్ట్ అనే సంస్థను నడిపాడు. అందులో సమంత, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, కీర్తి సురేష్‌లతో పెట్టుబడులు పెట్టించాడని అంటున్నారు. ఆ వ్యాపారంలోనూ వారందరినీ కాంతిదత్ చీట్ చేశాడని అంటున్నారు. ఇక సస్టెయిన్ కార్ట్‌తో తనకు సంబంధం లేదని, ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటికి వచ్చానని శిల్పారెడ్డి అంటున్నారు. కాంతి దత్‌తో తనకు వృత్తిపరమైన, వ్యక్తిగత సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు. మొత్తం మీద అధిక లాభాల ఆశను చూపించి పెట్టుబడులను కాంతిదత్ సేకరించినట్లు తెలుస్తోంది.