Site icon HashtagU Telugu

Tribal People: పోడుపై మళ్లీ పోరు!

Tribal2

Tribal2

మంచిర్యాల అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్న నెపంతో వాటిని తొలగించేందుకు పోలీసులు, అటవీ శాఖఅధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ భూమిలో ఉన్న మూడు గుడిసెల కోసం దాదాపు మూడు వందల మంది అటవీ, పోలీసు సిబ్బంది ఆ గూడెం చుట్టుముట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశగూడెం పోడు భూమిలో స్థానిక ఆదివాసులు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు ఉదయం అటవీ, పోలీస్ అధికారులు పెద్ద చేరుకొని దాడులు ప్రారంభించారు. గుడిసెలను తొలగించేందుకు అటవీ, పోలీసు అధికా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.

ఆదివాసీ మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో చేసేదేమి లేక కొన్ని గుడిసెలను నేలమట్టం చేసిన అధికారులు వెనుదిరిగారు. అయితే అటవీ భూముల్లో నుంచి ఆదివాసీలను ఎలాగైనా పంపించాలనే లక్ష్యంతో ఉదయమే పెద్ద ఎత్తున బలగాలను మొహరించారు. గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఒక వైపు వర్షం పడుతున్న అధికారులు గాని, ఆదివాసీలు కానీ. అధికారులు కానీ మెట్టు దిగలేదు. ఆ గుడిసెలు తొలగించేందుకు ఆదివాసీ మహిళలు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు ఆదివాసీ మహిళలు అధికారుల పైన కారంపొడి చల్లి అడ్డుకున్నారు. ఎట్టకేలకు వారిని పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకున్నారు.