నేటికి తెలంగాణలో మారుమూల గ్రామాలకు సరైన రహదారులు లేవు. దీంతో రొగమొచ్చినా, రొప్పచ్చినా ప్రజలు ఇబ్బందులు పడాల్సిందే. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ఓ గిరిజన మహిళ నిర్మానుష్య రహదారిపై ప్రసవించాల్సి వచ్చింది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మహిళ ప్రసవానికి వెళ్ళిన తర్వాత కాల్ చేసిన అంబులెన్స్ మారుమూల గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల సమయానికి రాలేకపోయింది.
అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో తులసిపేట గ్రామానికి చెందిన గంగామణి అనే గర్భిణి నడవాల్సి వచ్చింది. ప్రయాణం ప్రారంభించగానే నొప్పులు ఎక్కువై రోడ్డు పక్కనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని గంటల తర్వాత అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్‌లో ఉన్న వైద్య నిపుణులు గంగామణి, ఆమె నవజాత శిశువును పెంబి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించే ముందు అక్కడికక్కడే వైద్య సేవలు అందించారు.
Also Read: MLC Kavitha: మా సీఎం అభ్యర్థి కేసీఆర్, మీ సీఎం అభ్యర్థి ఎవరు: కవిత ఎన్నికల శంఖారావం