Telangana Triangle Politics: తెలంగాణ రాజకీయాలు ప్రధానంగా మూడు పార్టీల మధ్యే కొనసాగుతున్నాయి. అయితే ఈ మూడు పార్టీల ధోరణి విచిత్రంగా ఉంది. ఎన్నికల సమయం కావడంతో మూడు పార్టీల్లో రెండు పార్టీల మధ్య దోస్తీ కుదరడం ఖాయం. అయితే ఆ రెండు పార్టీలు ఎవరన్నది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కేంద్రంతో తెగతెంపులు తెంచుకుని నేషనల్ పార్టీగా అవతరించింది. కానీ రాష్ట్ర స్థాయిలో ఆ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీ, అధికార పార్టీ ఒకటేనని కొందరు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా వివాదాలేమి లేవు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానన్న కెసిఆర్ ఆ మాట తప్పి అధికారం చేపట్టారు. అయితే రాష్ట్ర స్థాయిలో కెసిఆర్ కు కాంగ్రెస్ నేతలకు పెద్దగా వివాదాలు కనిపించవు. సమయం సందర్భం వచ్చినప్పుడాల్లా సీఎం కెసిఆర్ కాంగ్రెస్ నేతలను పొగడటం పరిపాటిగా మారింది.
ఎన్నికల్లో పొత్తు అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఒక పార్టీని ఎదుర్కోవాలంటే మరో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందే. అయితే తెలంగాణాలో బీఆర్ఎస్ కు కావాల్సినంత ఎమ్మెల్యేల బలం, ప్రజా బలం ఉంది. కానీ రానున్న ఎన్నికల ఫలితాల్లో అనేక మార్పులు జరగవచ్చు. బీఆర్ఎస్ పరిపాలనపై తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అటు కాంగ్రెస్ సైతం తెలంగాణలో పూర్వవైభవాన్ని ప్రదర్శించాలి అనుకుంటుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే గ్రామ స్థాయిలో పెద్దగా ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ తో దోస్తీ కట్టవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు సీఎం కెసిఆర్ నోట్ల కట్టలు పంపించినట్లు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నడుస్తుందని అన్నారు పొన్నం. తెలంగాణాలో బీజేపీని కావాలనే కెసిఆర్ హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పొన్నం ప్రభాకర్. ఈ మధ్య బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ అవసరం లేకపోయినా బండి సంజయ్ ని లేపడానికి సీఎం కెసిఆర్ అరెస్ట్ కు సిద్ధమయ్యారని పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలకు పాల్పడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ములాఖత్ ఏర్పడిందని రాష్ట్రమే అనుమానిస్తుందని అన్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ స్కాములో పట్టుబడ్డ కవితను బీజేపీ ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కెసిఆర్ ఖరారు చేయనున్నారనే బండి వ్యాఖ్యలకు గాను పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ పై హాట్ కామెంట్స్ చేశారు. కర్ణాటకలో ఘోర పరాజయంతో బండికి మైండ్ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు.
Read More: Jasprit Bumrah: టీమిండియా అభిమానులకు శుభవార్త.. బుమ్రా వచ్చేస్తున్నాడు..!