Site icon HashtagU Telugu

Transgender: తెలంగాణ ఎన్నికల సంఘం ఐకాన్‌ గా ట్రాన్స్ జెండర్, ఓటుహక్కుపై లైలా క్యాంపెయిన్!

Leela

Leela

తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వేతర సంస్థ (NGO)ను  నడుపుతున్న 43 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ ఓరుగంటి లైలా తెలంగాణ ఎన్నికల సంఘం రాష్ట్ర ఐకాన్‌గా ఎంపికయ్యారు. లైలా వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలో సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడేందుకు ఒక ఎన్జీవోను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఐకాన్‌గా మారిన తర్వాత, లైలా ట్రాన్స్‌జెండర్లలో ఓటర్ల జాబితాలో నమోదు, ఎన్నికల ప్రాముఖ్యత, ఓటు హక్కుపై వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేస్తోంది.

ఓటు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ఐకాన్‌లను ఎంపిక చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. “మేం వరంగల్‌కు చెందిన ఓరుగంటి లైలాను ఎన్నికల సంఘం రాష్ట్ర ఐకాన్‌లలో ఒకరిగా ఎంపిక చేశాం. ఆమె ఓటర్ల నమోదును ప్రక్రియను వేగవంతం చేయడం,  ప్రజలతో మమేకమవడం చేస్తోంది. ట్రాన్స్‌జెండర్ల పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది. లైలా అవగాహన కల్పించడానికి కృషి చేస్తుంది. ఆమె జిల్లా ఎన్నికల అధికారులతో కలిసి పనిచేస్తోంది” అని సీఈఓ తెలిపారు.

ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడిన అనుభవం తనకు ఉందని, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తనకు ఆసక్తి ఉందని లైలా చెప్పారు. రాష్ట్రంలోని చాలా మంది ట్రాన్స్‌జెండర్లను కలుసుకుని తమ పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించామని, ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లను పౌరులుగా గుర్తించి ఓటు వేసే అవకాశం కల్పించిందని, తెలంగాణలో ఎక్కువ మంది ట్రాన్స్‌జెండర్లను ఓటర్లుగా తీర్చిదిద్దాలని లైలా అన్నారు. అన్నారు. “ఎన్నికల సంఘం ఐకాన్‌గా ఎంపిక కావడం నా జీవితంలో అత్యుత్తమ ఘట్టం. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించడంలో అధికారులు నా సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు” అని లైలా  చెప్పింది.

Also Read: Shobhita Rana Bikini: పెళ్లి చేసుకున్నా తగ్గేదేలే.. బికినీతో శోభితా రానా గ్లామర్ ట్రీట్

Exit mobile version