Site icon HashtagU Telugu

IPS Transfers : ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

Ips Transfers

Ips Transfers

IPS Transfers : ఆదివారం ఉదయం 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ కొత్త సర్కారు.. సాయంత్రంకల్లా ఐపీఎస్‌ల బదిలీపైనా నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. పి.విశ్వప్రసాద్‌ను హైదరాబాద్‌ అడిషనల్‌ ట్రాఫిక్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. హైదరాబాద్‌ సిట్‌, క్రైమ్‌ జాయింట్‌ సీపీగా ఏవీ రంగనాథ్‌, వెస్ట్‌ జోన్‌ డీసీపీగా ఎస్‌ఎం విజయ్‌కుమార్, హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా జోయల్‌ డేవిస్‌, నార్త్‌ జోన్‌ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీగా ఎన్‌ శ్వేత, సిటీ ట్రాఫిక్‌-1 డీసీపీగా ఎల్‌ సుబ్బారాయుడును బదిలీ చేసింది. నిఖితా పంత్‌, గజరావ్‌ భూపాల్‌, చందన దీప్తిలను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ రిపోర్ట్‌ చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వం నాన్‌ కేడర్‌ ఎస్పీలను సైతం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న ఎన్‌.వెంకటేశ్వర్లును సిటీ ట్రాఫిక్‌-3 డీసీపీగా నియమించింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌-3 డీసీపీగా ఉన్న డీ శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. రాచకొండ రోడ్‌ సేఫ్టీ డీసీపీ శ్రీబాలాదేవిని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించింది. మాదాపూర్‌-సైబరాబాద్‌ డీసీపీ సందీప్‌ను రైల్వేస్‌ అడ్మిన్‌ ఎస్పీగా ట్రాన్స్‌ఫర్‌ చేసింది. రాఘవేంద్రరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని(IPS Transfers) ఆదేశించింది.

Also Read: Dreaming Temple: కలలో ఆలయం కనిపించిందా.. అయితే మీ జీవితంలో జరగబోయే మార్పులివే?