తెలంగాణ (Telangana ) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Cogress Govt) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల (IAS Officers Transfer) బదిలీలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన రేవంత్ సర్కార్..తాజాగా మరో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు.
హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా
ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి.శ్రీజ
నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్
రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి
జనగామ అడిషనల్ కలెక్టర్‌గా పర్మర్ పింకేశ్‌కుమార్ లలిత్‌కుమార్
మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వత్సల్ తొప్పో
మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్
వనపర్తి అడిషనల్ కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్
జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదిరవన్ లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె..నేడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి కాట (Amrapali Kata) బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండిఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతో పాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి అభినందించారు.
Read Also : CM Revanth : సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం..నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దు