Site icon HashtagU Telugu

IPS Transfers : 20మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు

Ips Transfers

Ips Transfers

IPS Transfers : తెలంగాణలో మరోసారి ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. 20 మంది సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా రవిగుప్తాకు రాష్ట్ర సర్కారు పూర్తి బాధ్యతలను అప్పగించింది. రోడ్డు భద్రతా విభాగం ఛైర్మన్‌గా అంజనీకుమార్‌ను నియమించి, ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌, జైళ్లశాఖ డీజీగా సౌమ్య మిశ్రా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా రాజీవ్‌రతన్‌, సీఐడీ డీఐజీగా రమేష్‌ నాయుడు నియమితులయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి, హోంగార్డ్స్‌ ఐజీగా స్టీఫెన్‌ రవీంద్రను నియమించి ప్రభుత్వం.. అదనంగా వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విభాగాన్ని అప్పగించింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌, రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్‌, రైల్వే డీజీగా మహేశ్‌ భగవత్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డీఐజీగా బి.సుమతి నియమితులయ్యారు. సీఐడీ అదనపు డీజీగా నియమితులైన శిఖా గోయల్‌‌కు, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు(IPS Transfers) అప్పగించారు.

Also Read: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం పూర్తి.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్ళే..!

తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎం.రమేష్‌‌ను నియమించారు.  హైదరాబాద్‌ మల్టీ జోన్‌ ఐజీ-2గా తరుణ్‌ జోషిని నియమించి, హైదరాబాద్‌ మల్టీ జోన్‌-1 ఐజీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌రెడ్డి, సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ సంయుక్త కమిషనర్‌గా సత్యనారాయణ, మధ్య మండల డీసీపీగా శరత్‌చంద్ర పవార్‌, టీసీపీఎఫ్‌ అదనపు డీజీగా అనిల్‌ కుమార్‌ నియమితులు అయ్యారు.