Site icon HashtagU Telugu

Tragedy: పెద్దపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన, అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లి

Rakhi

Rakhi

రక్షాబంధన్ అన్నా చెల్లెళ్లు మరియు చెల్లెలు మధ్య బంధానికి ప్రతీక. రాఖీ రాగానే చాలా మంది సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఉత్సాహం చూపుతారు. అలాగే చెల్లెలు కూడా అన్నయ్యకు రాఖీ కట్టేందుకు ఆనందంగా పుట్టింటికి వచ్చింది. అయితే అదే తమ చివరి రాఖీ అని ఆ చెల్లి, అన్నా ఊహించలేకపోయారు. పెద్దపల్లి జిల్లాలో రాఖీ పండుగకు ముందు విషాదం చోటుచేసుకుంది. అన్న మృతదేహానికి ఆమె చెల్లెలు రాఖీ కట్టింది. ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లె గౌరమ్మ ఇంటికి వచ్చింది.

చెల్లెలితో ఆనందంగా గడుపుతున్న కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. ఆపై క్షణాల్లోనే కన్నకయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో సంతోషంతో అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలికి అంతులేని విషాదం మిగిలింది. చివరకు సోదరి సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది. వీరిద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రతిఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. చెల్లి రాఖీ కట్టే ద్రుశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: TCongress: టీకాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్న నేతలు

Exit mobile version