Site icon HashtagU Telugu

Telangana : విషాదం… పరుగెడుతూ గుండెపోటుతో ఎస్సై అభ్యర్థి మృతి…!!

Heart Attack

Heart Attack

ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న తపన. దాని కోసం అహర్నిశలు కష్టపడటం. తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఓ ఎస్సై అభ్యర్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సూర్యపేట జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మ్రుతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీకాంత్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ఇప్పుడు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టు కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో సాధన చేస్తుంటాడు.

రోజుమాదిరిగానే మంగళవారం కూడా గ్రౌండ్ లో పరుగులు తీస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారి గుండెలో నొప్పిరావడంతో కుప్పకూలాడు. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే శ్రీకాంత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. త్వరలో ఎస్సైగా తనకు కొడుకును చూస్తామనుకున్న తల్లిదండ్రులకు కన్నకొడుకు ఇలా మరణించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Exit mobile version