Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో అప్పటి విపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ4 నిందితుడిగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నారు. అయితే ఆయనకు ఇవాళ నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రాధాకిషన్ రావు తల్లి సరోజనమ్మ కన్నుమూశారు. ఆమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాధాకిషన్‌రావు తన తల్లిని చివరి చూపు చూసేందుకు అనుమతించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ వేయించారు. అత్యవసర పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. నాంపల్లి కోర్టు ఆయనకు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేపు(మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు రాధాకిషన్ బెయిల్‌పై ఉంటారు. ఆ తర్వాత పోలీసులు రాధాకిషన్‌ను కస్టడీలోకి తీసుకుంటారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లెగుట్టకు చెందిన రాధాకిషన్‌రావు పదోన్నతి పొందుతూ డీసీపీ స్థాయికి ఎదిగారు.
We’re now on WhatsApp. Click to Join
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) కేసులో విచారణ సందర్భంగా కీలక వివరాలను వెల్లడించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే అవన్నీ చేశామన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే భవ్య సిమెంట్ ఓనర్ ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ రఘునందన్ రావు, బంధువుల నుంచి కోటిరూపాయలు సీజ్ చేశామన్నారు. 56 మంది ఎస్ఓటీ సిబ్బందితో 1200 మంది ఫోన్లను ట్యాప్ చేశామని ఈ కేసులోని మరో నిందితుడు ప్రణీత్ రావు ఇటీవల పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారని ప్రణీత్ రావు, భుజంగరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభాకర్ రావు నుంచి ఈ ఆదేశాలు అందగానే ఫోన్ ట్యాపింగ్‌కు వాడిన ఫోన్లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశామని ప్రణీత్ రావు చెప్పాడు.
Also Read :CM Route : సెక్రటేరియట్‌లోని సీఎం కాన్వాయ్ రూట్‌లో మార్పులివే..
ఇటీవల మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి చెక్‌పెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక వేశారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆపరేషన్‌కు సంబంధించి కేసీఆర్ రచించిన వ్యూహాలను రాధాకిషన్ రావు పోలీసులకు దర్యాప్తు సందర్భంగా వివరించారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలని చూసినా కొందరు పోలీసు అధికారుల వైఫల్యంతో అది సాధ్యపడలేదని తన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు చెప్పారు.