Hyderabad: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి, సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్ కు వస్తున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 11:45 AM IST

Hyderabad: శీతకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్ కు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రహదారులపై పోలీసులు ట్రాఫిక్‌ను పరిమితం చేసి వేరే చోటుకు మళ్లిస్తారు. హాకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ జంక్షన్‌, బొల్లారం చెక్‌పోస్టు, నెవీ జంక్షన్‌, యాప్రాల్‌ రోడ్డు, హెలిప్యాడ్‌ వైజంక్షన్‌, బైసన్‌ గేట్‌, లోతుకుంట టీ జంక్షన్లు మూసేస్తున్నట్టు నగర ట్రాఫిక్‌ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.

ముర్ము..శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. డిసెంబరు 18 నుంచి 23 వరకూ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రథమ పౌరులు విడిది చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలుచోట్ల సోమవారం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు వెల్లడించారు.

సోమవారం (డిసెంబరు 18న) సాయంత్రం ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి 7 గంటలకు చేరుకోనున్నారు.

Also Read: Seethakka: ఆదివాసీ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి సీతక్క