Site icon HashtagU Telugu

Khairatabad Ganesh : ఖైర‌తాబాద్‌లో ఈ నెల 28 వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు.. బ‌డా గ‌ణేష్ ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు పూర్తి

Khairatabad

Khairatabad

హైద‌రాబాద్‌లో గ‌ణేష్ ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి. రేప‌టి నుంచి ఈ నెల 28 వ‌ర‌కు 11 రోజుల పాటు గ‌ణేష్ ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. గ‌ణేష్ ఉత్స‌వాలు సంద‌ర్భంగా పోలీసులు భ‌ద్ర‌తాచ‌ర్య‌లు చేప‌ట్టారు. ముఖ్యంగా ఖైర‌తాబాద్ బ‌డా గ‌ణేష్ ద‌గ్గ‌ర ఎలాంటి భక్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇటు ఖైర‌తాబాద్ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. రేప‌టి నుంచి నిమ‌జ్జ‌నం అయ్యే వ‌ర‌కు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. ఖైర‌త‌బాద్ గ‌ణేష్ ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులకు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయ‌ని తెలిపారు. ఈ ఆంక్ష‌లు ఉద‌యం 11 గంటల నుంచి అర్థ‌రాత్రి వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.రాజీవ్ గాంధీ విగ్రహం నుండి మింట్ కాంపౌండ్ వెళ్లే సాధార‌ణ ట్రాఫిక్‌కు అనుమ‌తి లేద‌ని.. అటు వైపు వెళ్లే వాహ‌నాల‌న్నీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు వెళ్లాల‌ని పోలీసులు సూచించారు. ఇటు రాజ్‌దూత్ లేన్ నుండి బడా గణేష్ వైపు రోడ్డులో ఎలాంటి వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు. రాజ్‌దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు ట్రాఫిక్‌ని మళ్లించారు.మింట్ కాంపౌండ్ నుండి ఐమాక్స్ థియేటర్ వైపు సాధారణ ట్రాఫిక్ అనుమతిలేద‌ని..అటుగా వెళ్లే వాహ‌నాలు మింట్ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లించారు. వాహ‌నదారులు టాఫ్రిక్ ఆంక్ష‌ల‌ను దృష్టిలో ఉంచుకుని త‌మ ప్ర‌యాణాన్ని కొన‌సాగించాల‌ని పోలీసులు సూచించారు.