Site icon HashtagU Telugu

HYD Traffic : మోదీ పర్యటన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!!

Modi

Modi

నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఏపీలోని విశాఖ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడు, మోనప్పఐలాండ్, రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్ర 7గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాశ్ నగర్, రసూల్ పురా టీ జంక్షన్, సీటీవో మార్గాల గుండా వెళ్లే వాహనాల దారి మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.