Site icon HashtagU Telugu

Hyderabad Traffic Restrictions: అలర్ట్.. రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!

Traffic Rules

Traffic

రేపు ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా మాస్ట్రో లైవ్ కాన్సర్ట్ జరగబోతోంది. ప్రత్యేక అతిథులుగా పలువురు ఇండస్ట్రీ సెలెబ్రిటీలు రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. చిరంజీవి, నాగార్జున తదితర ప్రముఖులు రాజాగారితో పాటు స్టేజిని పంచుకోబోతున్నారు. తమ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ జ్ఞాపకాలను స్టేజి మీద పంచుకోబోతున్నారు. అయితే మ్యూజిక్ కార్యక్రమం సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఏయే రూట్లలో

లింగంపల్లి నుంచి గచ్చిబౌలి సర్కిల్‌కు వచ్చే ట్రాఫిక్ హెచ్‌సీయూ డిపో, ఎస్‌ఎంఆర్ వినయ్, మజిద్‌బండ్ విలేజ్, హెరిటేజ్ జంక్షన్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి సర్కిల్ మీదుగా మళ్లించనున్నారు.

గచ్చిబౌలి సర్కిల్ నుండి లింగంపల్లికి వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి సర్కిల్, బొటానికల్ గార్డెన్,హెరిటేజ్, మజిద్‌బండ్ విలేజ్, SMR వినయ్, HCU డిపో, లింగంపల్లి మీదగా మళ్లిస్తున్నట్టు ప్రకటించారు. రాయదుర్గం నుంచి లింగంపల్లికి వచ్చే ట్రాఫిక్ ఐఐఐటీ వద్ద మళ్లించి, గోపీచంద్ అకాడమీ మీదుగా విప్రో సర్కిల్‌కు మళ్లిస్తున్నట్టు ప్రకటించారు.

ఫిబ్రవరి 26న గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లి వైపు, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు భారీ వాహనాలు అనుమతించరు. ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, ఆర్‌ఎంసీలు, వాటర్ ట్యాంకర్లను అనుమతించరు. గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా ప్రత్యక్ష సంగీత కచేరీ సందర్శంగా ఫిబ్రవరి 26న ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని నగర ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రకటించారు.