Traffic Diverted : శనివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు…వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న ట్రాఫిక్ పోలీసులు..!!

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శనివారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసు విభాగం శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Traffic Curbs June1

Traffic Curbs June1

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శనివారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసు విభాగం శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంతో తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దీనిలో భాగంగానే శనివారం ట్యాంక్ బండ్ పై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కారణంగా ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వాహనాదారులు గుర్తుంచుకుని ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30ల వరకు ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్యాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

  Last Updated: 12 Aug 2022, 09:19 PM IST